ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలి

Sep 4 2026 1:30 AM | Updated on Sep 4 2026 1:30 AM

ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలి టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలిగా సంధ్య ఉపాధ్యాయులకు సన్మానం కౌన్సిలర్‌కు.. బాధిత కుటుంబానికి పరామర్శ యూరియా వాడకంపై అవగాహన

కామారెడ్డి టౌన్‌: భారతరత్న అంబేడ్కర్‌పై కల్పిత కథనాలతో పుస్తకం రాస్తూ ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్న హమారా ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ డిమాండ్‌ చేశారు. కల్పిత నాయకుడు పేరిట వి డుదల చేయనున్న ఆ వివాదాస్పద పుస్తకాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధించాలని కోరారు.

సదాశివనగర్‌: టీఆర్‌ఎస్‌ మహిళా మండల అధ్యక్షురాలిగా అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉప్పల్‌వాయి సంధ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు సాయాగౌడ్‌ గురువారం తెలిపారు. జిల్లా అధ్యక్షుడు సంపత్‌గౌడ్‌ పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు. గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌నగర్‌లోని లయన్స్‌ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు సీనియర్‌ ఉపాధ్యాయులను రాష్ట్రపతి అవార్డు గ్రహీత లక్ష్మయ్య సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్‌ అధ్యక్ష, కార్యదర్శులు ప్రదీప్‌కుమార్‌, గంగాధర్‌, ప్రతినిధులు ఎం రాజన్న, మహేశ్‌రావు, రఘుకుమార్‌, హరీశ్‌గౌడ్‌, శంకర్‌ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దోమకొండ: కామారెడ్డి 46వ వార్డు కౌన్సిలర్‌ లక్ష్మీనారాహణను దోమకొండలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీజీ గౌడ్‌ గురువారం సన్మానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మారథాన్‌ పోటీల్లో లక్ష్మీనారాయణ జిల్లా తరఫున పాల్గొని పతకం సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ప్రేంకుమార్‌, నాయకులు నల్లవెల్లి అశోక్‌, ప్రభాకర్‌రెడ్డి, మధుసూదన్‌రావు, కుంచాల శేఖర్‌, కుంబాల రవి, బొమ్మెర శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మాచారెడ్డి: పాల్వంచ మండలం మంథని దేవునిపల్లికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త మంగలి ఎల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ మాజీ విప్‌ గంపగోవర్ధన్‌ గురువారం పరామర్శించి రూ. పదివేల ఆర్థికసాయాన్ని అందించారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజాగౌడ్‌, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌ రావు, సర్పంచ్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, నాయకులు గంగారెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, రాములు, రాఘవేందర్‌ రావు, నర్సింలు, రవి, దేవరాజ్‌ ఉన్నారు.

ఎల్లారెడ్డిరూరల్‌: మండలంలోని జంగమయిపల్లిలో నానో యూరియా వాడకంపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు గురువారం అవగాహన కల్పించారు. నానో యూరియా డ్రోన్‌ స్పేయర్‌ ద్వారా వాడకం గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి, ఆత్మ పీడీ మహిత, సాంకేతిక వ్యవసాయ అధికారి సుస్మిత, ఎల్లారెడ్డి డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు సుధా మాధురి, మండల వ్యవసాయ అధికారి శోభ, ఏఈవో రాజా డ్‌ సర్పంచ్‌ రాములు, ఉప సర్పంచ్‌ సిద్ధిరాములు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement