రామారెడ్డి(ఎల్లారెడ్డి): భూమిలో హద్దురాళ్ల ఏర్పాటుపై గొడవ జరుగగా, ఒకరిపై దాడికి పాల్పడిన అన్నదమ్ములపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై మురళి తెలిపారు. వివరాలు ఇలా.. రామారెడ్డి గ్రామానికి చెందిన సుప్పని రవికి అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రంగు రవీందర్ గౌడ్, రంగు రాజశేఖర గౌడ్ మధ్య భూమి విషయంలో గతంలో గొడవలు జరిగినవి. రవి గురువారం పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న తన ప్లాటులో హద్దురాళ్లు వేస్తుండగా, రవీందర్‌గౌడ్ అతని తమ్ముడు రాజశేఖరగౌడ్ వచ్చి గొడవకు దిగారు. ఈక్రమంలో రవికి గాయాలు కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రవీందర్‌గౌడ్, రాజశేఖర్‌గౌడ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


