మార్షల్‌ ఆర్ట్స్‌లో విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

మార్షల్‌ ఆర్ట్స్‌లో విద్యార్థుల ప్రతిభ

Sep 4 2026 1:30 AM | Updated on Sep 4 2026 1:30 AM

సదాశివనగర్‌: మండల కేంద్రంలోని మాడల్‌ స్కూల్‌ తొమ్మిదో తరగతి విద్యార్థిని లితిన మార్షల్‌ ఆర్ట్స్‌లో ఉత్తమ ప్రతిభ చూపి బంగారు పతకాన్ని సాధించినట్లు ప్రిన్సిపాల్‌ రాజిరెడ్డి గురువారం తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన కుంగ్‌ ఫు కాటా అనే విభాగంలో బంగారు పతకం సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇసుక ట్రాక్టర్‌ స్వాధీనం

గాంధారి(ఎల్లారెడ్డి): మండలంలోని గుర్జాల్‌ బీట్‌లో నుంచి గురువారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఆర్వో రమేష్‌ తెలిపారు. గుర్జాల్‌ చెందిన జయరాం ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పట్టుకుని ట్రాక్టర్‌ను ఫారెస్టు రేంజ్‌కు తరలించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement