హైవేపై ఢీకొన్న కార్లు | - | Sakshi
Sakshi News home page

హైవేపై ఢీకొన్న కార్లు

Aug 18 2026 1:09 AM | Updated on Aug 18 2026 1:09 AM

డిచ్‌పల్లి: మండలంలోని సీఎంసీ మెడికల్‌ కాలేజ్‌ సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. డిచ్‌పల్లి ఎస్సై మహమ్మద్‌ ఆరీఫ్‌ తెలిపిన వివరాలు ఇలా.. సీఎంసీ మెడికల్‌ కాలేజ్‌ సమీపంలో సోమవారం మధ్యాహ్నం వేగనార్‌ కారు యూ టర్న్‌ తీసుకుంటుండగా, అదే సమయంలో హైద రాబాద్‌ వైపు నుంచి నాగాపూర్‌ వైపు వెళ్తున్న వోక్స్‌వాగన్‌ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్ల ముందుభాగాలు దెబ్బతిన్నా యి. వోక్స్‌వాగన్‌ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిలో ఒకరి తీవ్ర గాయాలైన ట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బాధితులు ప్రయివేట్‌ ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. గాయ పడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ముగ్గురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement