గీతన్న సభను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

గీతన్న సభను జయప్రదం చేయాలి

Aug 18 2026 1:09 AM | Updated on Aug 18 2026 1:09 AM

గీతన్న సభను జయప్రదం చేయాలి జిల్లా కళాకారుల సంఘం కార్యవర్గం ఎన్నిక సోమారంపేట విద్యార్థుల ప్రతిభ మంత్రి వాకిటి శ్రీహరికి వినతి నిధుల దుర్వినియోగంపై గ్రామసభలో ఆగ్రహం జాజాలను కలిసిన నాయకులు

కామారెడ్డి టౌన్‌ : హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద మంగళవారం జరిగే గీతన్న సభను జయప్రదం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌గౌడ్‌ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగష్టు 2న ప్రారంభించిన గీతన్న చైతన్య యాత్ర మంగళవారం హైదరాబాద్‌ సభతో ముగుస్తుందన్నారు. దీంట్లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం కల్లుగీత కా ర్మికులకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డి మాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు రవిందర్‌,రాజాగౌడ్‌,స్వామి తదితరులున్నారు.

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి జిల్లా కళాకారుల సంఘం నూతన కార్యవర్గా న్ని సోమవారం ఎన్నుకున్నారు.జిల్లా గౌరవ అధ్యక్షుడిగా రెడ్డి రాజయ్య, నర్సింలు,అధ్యక్షుడిగా కాగుల మోహన్‌ యా దవ్‌, ప్రధానకార్యదర్శిగా సురేందర్‌, ఉపాధ్యక్షుడిగా రాముపటేల్‌, సత్యనారాయణ, దేవాగౌ డ్‌, కార్యదర్శిగా పల్లె నర్సింలు, సంయుక్త కార్యదర్శులుగా యాదగిరిగౌడ్‌, రెడ్డి స్వప్న, మహ్మద్‌ మహమూద్‌, నవీన్‌రావు, కోశాధికారిగా డప్పు స్వామి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా శంకర్‌గౌడ్‌లు ఎన్నికయ్యారు. కళాకారుల సమస్యలను గుర్తించి సంక్షేమం,ఉపాధి అవకాశా లు, గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

మాచారెడ్డి: మండలంలోని సోమారంపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాదులోని రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో ప్రతిభ కనబరిచారు. పిరమిడ్‌ ఆకారం, అలాగే గ్రామ దేవత ల వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్‌,సోమారంపేట సర్పంచ్‌ మమత,సోమారంపేట తండా సర్పంచ్‌ సునీత, గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు.

భిక్కనూరు: కామారెడ్డి జిల్లా లో క్రీడల అభివృద్ధికి సహకరించా లని జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి వినతిప్రతం అందజేశారు. జిల్లా క్రీడ ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని క్రీడల అభివృద్ధికి నిధులను కేటాయించాలని, జిల్లా లో క్రీడకారులను తర్పీదు ఇచ్చేదుకు సంస్థను ఏర్పాటు చేయాలని విన్నవించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాజుపాల్గొన్నారు.

బాన్సువాడ రూరల్‌: మండలంలోని కొత్తాబాది గ్రామంలో సోమవారం సర్పంచ్‌ తుఫ్రాన్‌ సాయాగౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభ రసాభాసగా సాగింది. గ్రామాభివృద్ధికి మంజూరైన ప్రభుత్వ నిధులు, చేపట్టిన పనులు, నిధుల వినియోగంపై గ్రామ యువకులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సర్పంచ్‌ను ప్రశ్నించారు. గత ఐదేళ్ల కాలంలోనూ నిధుల దుర్వినియోగం జరిగిందని జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని వారు డిమాండ్‌ చేశారు. గ్రామంలో సమస్యలు ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. త్వరలో కలెక్టర్‌ను కలిసి జీపీ ఆదాయ–వ్యయాలపై విచారణ జరిపించాలని ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు దేవిసింగ్‌, గోపాల్‌, అబ్రార్‌, తదితరులు పేర్కొన్నారు.

తాడ్వాయి : మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్‌నాయకులు, ప్రజాప్రతినిధులు సోమవారం ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను కలిశారు. మండలంలోని కన్‌కల్‌ ఉపసర్పంచ్‌ మహేశ్‌ ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా ఉపాధ్యాక్షుడిగా ఎన్నికై న సందర్భంగా ఆయన్ను సన్మానించారు. సర్పంచ్‌లు మంగారెడ్డి, మైలారం రవీందర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ మహేశ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ కపిల్‌రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement