భిక్కనూరు: బైక్‌ల చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు భిక్కనూరు ఎస్సై అనిల్ తెలిపారు. రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు శంకర్, క్రిష్ణలు సోమవారం భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తుండగా పట్టుకున్నామన్నారు. వారిని విచారించగా.. ఇటీవల చోరీ చేసిన రెండు బైక్‌లను హైదరాబాద్‌కు తీసుకెళ్లి విక్రయించేందుకు వెళ్తున్నట్లు తేలిందన్నారు. దీంతో వీరిని అరెస్టు చేసి బైక్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు.


