దోమకొండ: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో లబ్ధిదారులు సోమవారం ఇందిరమ్మ గృహ ప్రవేశం చేశారు. దోమకొండకు చెందిన బొడపుంటి లావణ్య, చాకలి భార్గవిలకు మాజీ జెడ్పీటీసీ సభ్యులు తీగల తిర్మల్‌గౌడ్ దుస్తులను అందజేశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు అనంతరెడ్డి, సీతారం మధు, గోపాల్‌రెడ్డి, నర్సింలు, నాయకులు నయిం, షమ్మీ, బాల్‌రాజ్, నరేష్, రాజు, చంద్రారెడ్డి, తదితరులు ఉన్నారు.
వృద్ధాశ్రమంలో అల్పాహారం..
దోమకొండ: మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు సోమవారం డీసీసీబీ బ్యాంకు ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు. సమాజసేవలో భాగంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో వీరికి అల్పాహారం అందించినట్లు బ్యాంకు మేనేజర్ శృతివాణి తెలిపారు. వృద్ధాశ్రమ నిర్వహకులు దాస్ ఎల్లం, సంపత్, డీసీసీబీ బ్యాంకు సిబ్బంది శృతి, పర్హానా,అరుణ్, బాల్‌రాజ్, ప్రదీప్,ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.
పిట్లం : పిట్లం – బాన్సువాడ రోడ్డు మధ్యలో లారీ మెయిన్ పట్టి విరిగిపోవడంతో ఆగింది. దీంతో సుమారు మూడు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని సిద్దాపూర్ గ్రామం సమీపంలో పిట్లం – బాన్సువాడ రోడ్డుపై వర్షాలకు భారీ గుంతలు ఏర్పాడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


