తాడ్వాయి(ఎల్లారెడ్డి): లింగంపేట్ మండలం నుంచి కామారెడ్డి వైపు కారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పట్టుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. తాడ్వాయి పోలీస్ స్టేషన్ సిబ్బంది సోమవారం ఉదయం కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టగా, ఓ కారును అనుమానాస్పదంగా గుర్తించి తనిఖీ చేయగా రేషన్ బియ్యం సంచులను గుర్తించారన్నారు. కారులో ఉన్న వ్యక్తిని సంగన్నగారి భాస్కర్ గౌడ్‌గా గుర్తించి, కారు, బియ్యాన్ని స్వాధీనం చేసుకొని పీఎస్‌కు తరలించారు. డీటీ తిరుపతి పంచనామా ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు.


