నేటి నుంచి కొత్త ఓటర్ల నమోదు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కొత్త ఓటర్ల నమోదు

Aug 18 2026 1:09 AM | Updated on Aug 18 2026 1:09 AM

ఆర్డీవో రవీంద్‌రెడ్డి

బాన్సువాడ : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్ల కోసం మంగళవారం నుంచి నమోదు కార్యక్రమం, మార్పులు, చేర్పుల కోసం ఫారం 6,7,8 స్వీకరిస్తామని బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలో 1,96,331 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు సర్‌ 89.87 శాతం పూర్తయిందని, డ్రాప్ట్‌ ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశామని అన్నారు. నియోజకవర్గంలో 19,887 ఓట్లు డిలీట్‌ అయ్యాయన్నారు. ఓటర్ల పేర్లు వివరాల్లో ఏమైన తప్పులు, అభ్యంతరాలుంటే సంబంధిత బీఎల్‌వోలను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ నరేందర్‌గౌడ్‌, కాంగ్రెస్‌ నాయకులు కాసుల రోహిత్‌, మాసాని రవీందర్‌రెడ్డి, బీజేపీ నాయకులు కోనాల గంగారెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు రమేష్‌యాదవ్‌, టీడీపీ నాయకులు శంషోద్దీన్‌, ఎంఐఎం నాయకులు హశం తదితరులు ఉన్నారు.

ఎల్లారెడ్డిలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను ఆర్డీవో ప్రభాకర్‌ సోమవారం విడుదల చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఆర్డీవో నోటీసు బోర్డుపై ప్రదర్శించారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదులు చేయవచ్చని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 6 వేల 34 ఉండగా, వీటిలో పురుష ఓటర్లు 99 వేల 519, మహిళా ఓటర్లు లక్షా 6 వేల 821, ట్రాన్స్‌జెండర్‌ 2 ఉన్నాయన్నారు.

ప్రజావాణిలో 5 ఫిర్యాదులు...

ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 5 ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement