నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్–గుండారం రోడ్డుపై బైక్‌ను టిప్పర్ ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందాడు. రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా.. ఖానాపూర్‌లోని భాగ్యనగర్ కాలనీకి చెందిన అలండి అనిల్(38) సోమవారం బైక్‌పై గుండారం నుంచి ఖానాపూర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో అతడి బైక్‌ను ఎదురుగా వస్తున్న టిప్పర్ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ ఢీకొట్టాడు. ఈ ఘటనలో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
బాన్సువాడలో మరొకరు..
బాన్సువాడ: పట్టణంలోని కొయ్యగుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ గ్రామానికి చెందిన సుభాష్‌గౌడ్ (32) నాగుల పంచమి సందర్బంగా కొములంచ గ్రామంలోని తన సోదరి ఇంటికి వచ్చాడు. అతడు సోమవారం రాత్రి బైక్‌పై తిరిగి సొంతూరికి బయలుదేరాడు. కొయ్యగుట్ట సమీపంలో అతడి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాన్సువాడ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


