సీయూఈటీలో విద్యార్థిని ప్రతిభ
బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన మల్లెల శివ సేతన సీయూఈటీ(సెంట్రల్ యూనివర్సీటీ ఎంట్రెన్స్ టెస్ట్)లో ప్రతిభ కనబర్చింది. మల్లెల శివ సేతన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ ఇంటగ్రెడ్ డిగ్రీ కోర్సు ఇన్ హిస్టరీ విభాగంలో 96 శాతం మార్కులు సాధించింది. సివిల్‌కు సన్నద్ధమై ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది.
ఉత్తమ ఎంఈవోకు సన్మానం
మాచారెడ్డి: జిల్లాస్థాయి ఉత్తమ ఎంఈవో దేవేందర్ రావుకు సోమవారం మండలంలోని ఘన్‌పూర్ పాఠశాలలో ఉపాధ్యాయులు సన్మానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజురాణి, దేవిచంద్, సంతోష్, అంజలి, రమాదేవి, రజిత, గోపాలకష్ణ, పవన్, నవ్య, విద్య ఉన్నారు.
ఎంపీడీవోను సన్మానించిన
కాచాపూర్ జీపీ పాలకవర్గం
భిక్కనూరు: నూతన ఎంపీడీవో సవితను తన కార్యాలయంలో కాచాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సోమవారం సత్కరించారు. గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి ఉప సర్పంచ్ దశరథం, నేతలు సంతోషుగౌడ్, అమృత్‌రావు, వీరేశంకం, ఆకుతోట స్వామి, తొగరి లింగం, బైండ్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.


