సులువుగా ఎరువులు బుక్ చేసుకోవచ్చు..
● బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ..
● ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానంలో
రైతులందరికి ఎరువులు
ఎల్లారెడ్డి: సబ్సిడీ ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టి రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు సరికొత్త యాప్‌ను కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎఫ్‌ఎఫ్‌ఎస్ (ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ ) యాప్ పేరుతో రైతులకు సబ్సిడీ ఎరువులను పారదర్శకంగా నల్ల బజారుకు తరలిపోకుండా రైతులకు నేరుగా అందించడమే ఈ యాప్ ఉద్దేశం.యాప్ ద్వారా యూరియా, డీఏపీ, ఎంవో పీ, తదితర ఎరువులను రైతులు బుక్ చేసుకోవాలి.
భూమి విస్తీర్ణం ఆధారంగానే ..
ఈ విధానం ద్వారా రైతు పేరున ఉన్న భూమి వివరాలు ఫార్మర్ రిజస్ట్రీ లేదా పట్టాదార్ పాస్‌బుక్‌ల ద్వారా నిర్ణయింపబడుతుంది. రైతులు సాగుచేసే భూమి పరిమాణం, వేసే పంట ఆధారంగా సాఫ్ట్‌వేర్ సిస్టమే స్వయంగా ఎరువుల కోటాను గుర్తిస్తుంది.దీంతో నల్లబజారు దందా అరికట్టడంతో పాటు అర్హులైన రైతులందరికీ ఎరువులు అందుతాయి.
ఎఫ్‌ఎఫ్‌ఎస్‌తో మూడు పద్ధతులలో బుకింగ్
● గూగుల్ ప్లే స్టోర్ నుంచి అధికారిక ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి
● యాప్‌లో కావాల్సిన భాషను ఎంచుకుని పట్టాదారు పాస్‌బుక్ నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
● తర్వాత రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా లేదా ఫేస్ అఽథెంటికేషన్ (ఫేస్ ఐడీ) ద్వారా లాగిన్ అవ్వాలి
● హోమ్ స్క్రీన్‌పై వచ్చే బుక్ ఫర్టిలైజర్ క్లిక్ చేసి, తమ జిల్లా, మండలం, గ్రామాన్ని ఎంపిక చేసుకోవాలి.
● యాప్‌లోనే డీలర్‌ను, కావాల్సిన ఎరువుల బస్తాల సంఖ్యను ఎంచుకోవాలి..
● వివరాలు నమోదు చేశాక రైతుల మొబైల్‌కు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ కోడ్‌ను రైతులు తాము ఎంచుకున్న దుకాణంలో చూపించాల్సి ఉంటుంది.
● డీలర్ వద్ద పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) యంత్రం ద్వారా బయోమెట్రిక్ లేదా మొబైల్ ఓటీపీ ద్వారా ధృవీకరణ చేసి ఎరువులు అందజేస్తారు
సొసైటీలు, ఎరువుల డీలర్ల వద్ద ..
● రైతులు నేరుగా దుకాణానికి వెళ్లి అక్కడ డీలర్ లేదా సొసైటీ సిబ్బంది ద్వారా తమ పాస్‌బుక్ వివరాలు సిస్టమ్‌లో నమోదు చేసుకోవచ్చు
● అక్కడికక్కడే వారి భూమి కోటాను పరిశీలించి బయోమెట్రిక్ వేలిముద్ర లేదా మొబైల్ యాప్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసి ఎరువులను విక్రయిస్తారు.
మీ సేవ...కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా..
● స్మార్ట్‌ఫోన్ లేని లేదా యాప్ వాడకం తెలియని సాధారణ రైతుల కోసం ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని కల్పించింది.
● రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్ నంబర్ లేదా ఆధార్ కార్డు తీసుకుని సమీపంలోని మీ సేవ లేదా సీఎస్‌సీకి సెంటర్లకు వెళ్లాలి.
● కేంద్ర నిర్వాహకుడికి వివరాలు అందిస్తే వారు ప్రభుత్వ పోర్టల్‌లో ఎరువులను బుక్ చేస్తారు.
● ఇందుకోసం ప్రభుత్వం రూ. 10 నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎ రువులను సులువుగా బుక్ చే సుకోవచ్చు..ఏ రైతుకు ఎంత కోటా అన్న విషయం యాప్ లోని సాఫ్ట్‌వేర్ గుర్తిస్తుంది. స్మా ర్ట్‌ఫోన్ లేని రైతులు సొసైటీలు, డీలర్ల వద్ద నుంచి లేదా మీ సేవా కేంద్రాల నుంచి తమకు కావాల్సిన ఎరువులు బుక్ చేసుకోవచ్చు.
– మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి


