‘విండో’లకు పాలక వర్గాలు | - | Sakshi
Sakshi News home page

‘విండో’లకు పాలక వర్గాలు

Aug 8 2026 1:59 AM | Updated on Aug 8 2026 1:59 AM

‘విండో’లకు పాలక వర్గాలు

కామారెడ్డికి శ్రీనివాస్‌రెడ్డి,

తిప్పాపూర్‌కు భీంరెడ్డి

12 మంది చొప్పున డైరెక్టర్లు..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పాలక వర్గాలను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కామారెడ్డి విండో చైర్మన్‌గా చిందాల(గూడెం) శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్లుగా చింతల లక్ష్మీనర్సింలు, కన్కంటి చిన్నసాయిలు, గోవూరి నర్సింహారెడ్డి, జెగ్గ లింగం, తెడ్డు ప్రమీల, నీలం లక్ష్మి, బొంబోతుల కుమార్‌గౌడ్‌, హన్మాండ్ల రాజు, కృష్ణాజీగారి ఆనంద్‌రావ్‌, పెద్ద పొతన్నగారి రాజేశ్‌, మామిండ్ల హనుమాండ్లు, లంబాడి రమేశ్‌లను నియమించారు.

భిక్కనూరు మండలం తిప్పాపూర్‌ విండో చైర్మన్‌గా తిరుపారి భీంరెడ్డి, డైరెక్టర్లుగా కుంట సుధాకర్‌రెడ్డి, చంద్రయ్యగారి వరలక్ష్మి, రంగా రవీందర్‌గౌడ్‌, మంద రమేశ్‌, ఉరడి కొమురయ్య, బోయిని యాదగిరి, కొండ మాసయ్య, బర్కం శ్యామల, కోటిగల్ల మధుసూదన్‌, గంపల వినయ్‌సాగర్‌, ఎరుకల కనకవ్వ, బోయిని కోటయ్యలను నియమించారు. ఆరు నెలల పదవీ కాలం లేదా ఎన్నికలు జరిగే వరకు వీరు పదవుల్లో కొనసాగనున్నారు. కాగా నామినేటెడ్‌ పద్ధతిన నియమించిన పాలక వర్గంలో వైస్‌ చైర్మన్‌ పోస్ట్‌ లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement