కామారెడ్డి రూరల్: సమాజానికి ఉపయోగపడే వినూత్న ప్రాజెక్ట్‌లను రూపొందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎకో సైన్స్ ప్రాజెక్ట్ నమూనా ప్రత్యేక వర్క్‌షాష్ నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానంతో పర్యావరణ పరిరక్షణకు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేయాలని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో మల్లికార్జున్, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్‌చార్జి బాలగంగాధర్, సోహం రోబోటిక్స్ ప్రతినిధులు, భౌతిక, జీవశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


