పంట మార్పిడిని ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

పంట మార్పిడిని ప్రోత్సహించాలి

Aug 8 2026 1:29 AM | Updated on Aug 8 2026 1:29 AM

సమాచార నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి

కామారెడ్డి టౌన్‌ : రైతులకు అవగాహన కల్పించి, పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని మంత్రులు సూచించారు. శుక్రవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు హైదరాబాద్‌నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వన మహోత్సవం, స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ, వ్యవసాయం తదితర అంశాలపై సమీక్షించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు చేపట్టిన పంట కుంటల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వివరాలను రైతులకు తెలియజేసేందుకు గ్రామీణ స్థాయిలో ’ఇరిగేషన్‌ అడ్వైజరీ’ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వన మహోత్సవం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు 15న చేపట్టే నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇరిగేషన్‌ అడ్వైజరీ సమావేశాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్‌, అదనపు కలెక్టర్‌లు విక్టర్‌, గిరి, డీఆర్‌వో పాండు, జెడ్పీ సీఈవో చందర్‌ నాయక్‌, డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, డీఈవో మల్లికార్జున్‌, జిల్లా వ్యవసాయాధికారి రామ్మోహన్‌, ఉద్యాన శాఖ అధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: డిస్ట్రిక్ట్‌ సెన్సస్‌ హ్యాండ్‌బుక్‌ (డీసీహెచ్‌బీ) తయారీలో భాగంగా క్షేత్రస్థాయి సమాచార సేకరణలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెన్సస్‌ ఆపరేషన్స్‌ (డీసీవో) డైరెక్టర్‌ భారతి హోలికేరి సూచించారు. శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. డిస్ట్రిక్ట్‌ సెన్సస్‌ హ్యాండ్‌బుక్‌ ప్రభుత్వ శాఖలు, ప్రణాళికా రూపకర్తలు, పరిశోధకులకు జిల్లా స్థాయి సమగ్ర వివరాలను అందించే విలువైన ఆధార గ్రంథమన్నారు. జిల్లా అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ పాలసీల రూపకల్పనకు ఈ సమాచారం ఎంతో కీలకమని తెలిపారు. ఈనెల 10 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు నిర్వహించనున్న డీసీహెచ్‌బీ ఫీల్డ్‌ వర్క్‌ను అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. వీసీలో జిల్లానుంచి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, అదనపు కలెక్టర్‌ విక్టర్‌, డిప్యూటీ కలెక్టర్‌ రవితేజ, అధికారులు పాల్గొన్నారు.

వనమహోత్సవ లక్ష్యాలను

పూర్తి చేయాలి

వీసీలో రాష్ట్ర మంత్రులు

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల

నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement