ఎల్లారెడ్డి అభివృద్ధికి సహకరించండి | - | Sakshi
Sakshi News home page

ఎల్లారెడ్డి అభివృద్ధికి సహకరించండి

Aug 8 2026 1:29 AM | Updated on Aug 8 2026 1:29 AM

సీఎంను కోరిన ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. శుక్రవారం ఆయన సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి, సమస్యలను విన్నవించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీ పనులకు వెంటనే పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని, ఎల్లారెడ్డిలో ఆర్టీసీ బస్‌ డిపో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాన్సువాడ –ఉప్పల్వాయి ప్రధాన రహదారిపై సర్వాపూర్‌ –మొండిసడక్‌ మధ్య, గాంధారి –తిమ్మాపూర్‌ మధ్య హైలెవల్‌ బ్రిడ్జీలను మంజూరు చేయాలని కోరారు. గాంధారి మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని, లింగంపేట, సదాశివనగర్‌, రామారెడ్డి, గాంధారి మండలాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. తన ప్రతిపాదనలను సీఎం సానుకూలంగా పరిశీలించి, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అన్ని పనులకు నిధులు విడుదల చేసి, దశలవారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement