● తలసేమియా బాధితుల కోసం
98 యూనిట్ల రక్తం సేకరణ
బీబీపేట: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం శుక్రవారం మండల కేంద్రంలోని వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్), కామారెడ్డి రక్తదాతల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి నాగరాణి, ఐవీఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. చిన్నారుల ప్రాణాల కోసం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. రక్తదాతలకు ప్రశంసపత్రాలను అందజేశారు. వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, సర్పంచ్ ఉప్పల సాద్విక సాయి, వాసవి క్లబ్ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, శ్రీ నివాస్, నాగభూషణం, యాదగిరి, జమీల్ అహ్మద్, డాక్టర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


