లింగంపేట: విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని జడ్జి సుష్మ సూచించారు. శుక్రవారం ఆమె లింగంపేట కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలన్నారు. టీచర్లు అంకిత భావంతో పనిచేసి విద్యార్థుల ఉన్నతికి కృషిచేయాలన్నారు. అనంతరం తరగతి గదులను, పాఠశాలలోని కిచెన్ గది, స్టోర్ రూమ్, పడుకునే గదులను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆమె వెంట ఎస్సై దీపక్‌కుమార్, ప్రత్యేకాధికారి వాసంతి, సిబ్బంది ఉన్నారు.


