రాష్ట్ర పోలీసు క్రీడల్లో జిల్లాకు 11 పతకాలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పోలీసు క్రీడల్లో జిల్లాకు 11 పతకాలు

Mar 14 2026 7:32 AM | Updated on Mar 14 2026 7:32 AM

కామారెడ్డి అర్బన్‌: రాష్ట్ర పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో జిల్లా పోలీసు క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ చూపి తొమ్మిది కాంస్య పతకాలు, ఒక రజత పతకం సాధించారు. క్రీడాకారులను శుక్రవారం ఎస్పీ రాజేశ్‌ చంద్ర అభినందించారు. పోలీసుల్లో క్రమశిక్షణకు, మానసిక ఒత్తిడిని జయించడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు.

విజేతలు వీరే : టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో జి.తిరుపతి రజత పతకం సాధించారు. విలువిద్యలో ఎన్‌.సరిచంద్‌, పవర్‌ లిఫ్టింగ్‌ 66 కిలోల విభాగంలో జానకీరామ్‌, రెజ్లింగ్‌ 92 కిలోల విభాగంలో బాలరాజు, 97 కిలోల విభాగంలో ఎన్‌.ప్రభు, మహిళల 30 కిలోమీటర్ల సైక్లింగ్‌లో ఎం.రజిత, కబడ్డీలో డి.బుజ్జి, బి.సవితారాణి, ఎం.రేఖ, కే.ప్రియాంకలు కాంస్య పతకాలు సాధించారు. టీం ఇన్‌చార్జి బి.సంతోష్‌కుమార్‌ అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement