మద్నూర్(జుక్కల్): ఎఫ్‌పీవో ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఎఫ్‌పీవో ఉన్నతాధికారి శివానీగుప్తా అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మద్నూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో రైతులు భాగస్వాములు కావాలని సూచించారు. ఎఫ్‌పీవో పంటను మద్దతు ధరతో కొనుగోలు చేపడుతుందని తెలియజేశారు. మండల కేంద్రంలోని సమీపంలో జాతీయ రహదారి పక్కన ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా సిబ్బంది గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. డీసీవో రాములు, ఎంపీడీవో రాణి, స హకార సంఘాల ఇన్‌చార్జి లక్ష్మీనారాయణ, అధికా రి అబ్దుల్ అలీం, ఏవో రాజు, ఉప సర్పంచ్ రమేశ్, సొసైటీ కార్యదర్శి గంగాధర్ పాల్గొన్నారు.


