ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలి

Mar 14 2026 7:32 AM | Updated on Mar 14 2026 7:32 AM

పిట్లం(జుక్కల్‌): ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని ఎంఈవో దేవి సింగ్‌ సూచించారు. ఆయన శుక్రవారం మండల కేంద్రంలో ఇన్విజిలేటర్లు, మూడు సెంటర్ల చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా దేవిసింగ్‌ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేశామని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీ నిర్వహించాలన్నారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రమణారావు, శ్రీనివాస్‌ సూరి, శ్రీలత, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement