పరీక్షా కేంద్రాల వద్ద ప్రచారం | - | Sakshi
Sakshi News home page

పరీక్షా కేంద్రాల వద్ద ప్రచారం

Mar 14 2026 7:32 AM | Updated on Mar 14 2026 7:32 AM

బాన్సువాడ రూరల్‌: బాన్సువాడ డివిజన్‌లోని వివిధ ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాల వద్ద శుక్రవారం శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల అధ్యాపకులు ప్రచార కరపత్రాలు పంచిపెట్టారు. ఇంటర్మీడియేట్‌ తర్వాత డిగ్రీలో చేరాలని సూచించారు. అందుబాటులో ఉన్న కోర్సులు, కల్పిస్తున్న వసతుల గురించి వివరించారు. మండల కేంద్రంలోని బాన్సువాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రేణుక ఒకేషనల్‌ కళాశాల, కొయ్యగుట్టలోని బాలికల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల, మైనార్టీ కళాశాలలతో పాటు పిట్లం, గాంధారి, బిచ్కుంద, వర్ని, కోటగిరి మండల కేంద్రాల్లోని ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాల వద్ద ప్రచారం చేపట్టినట్లు ప్రిన్సిపల్‌ గంగాధర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement