భారీ బందోబస్తు
భిక్కనూరు: మండలకేంద్ర శివారులో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య కార్యక్రమం జరిగింది. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐలు సంపత్‌కుమార్, తిరుపయ్య ఎస్సై ఆంజనేయులతో పాటు డివిజన్‌లోని అందరూ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంగణం వరకు వాహనాలను అనుమతించలేదు. సుమారు అరకిలోమీటర్ దూరంలోనే వాహనాలను నిలిపివేయడంతో ప్రజలు కాలినడకన వచ్చారు.
బంద్ విజయవంతం
భిక్కనూరు: మండల కేంద్ర శివారులో ఫార్మా కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ బుధవారం చేపట్టిన భిక్కనూరు బంద్ విజయవంతమైంది. ప్రజలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, హోటళ్లు, దుకాణాలను మూసి ఉంచారు.


