తాళం వేసి ఊరెళితే జాగ్రత్తలు పాటించాలి
కామారెడ్డి క్రైం: ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించా లని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా చాలామంది ప ట్టణాల నుంచి గ్రామాలకు వెళ్తుంటారన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యానికి విలువైన సొత్తు అపహరణకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్నా రు. కష్టార్జితం దొంగల పాలు కాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. ముఖ్యంగా బంగారం, వెండి, నగదు ఇతర విలువైన వస్తువుల ను బ్యాంకు లాకర్లలో పెట్టుకోవడం ఉత్తమమన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, ఊళ్లకు వెళ్లేటప్పుడు పక్కింటి వారికి, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించా రు. తాళం బయటకు కనిపించేలా ఉండకూడదన్నారు. కాలనీల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఒక ప్రకటనలో సూచించారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాలో రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడానికే పొ లంబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యుత్ శాఖ ఎస్‌ఈ రాపెల్లి రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటివర కు 67 పొలంబాట కార్యక్రమాలు నిర్వహించి, విద్యుత్ స మస్యలను తక్షణమే పరిష్కరించామని పేర్కొన్నారు. 1,796 వంగిన స్తంభాలను, 1,495 చోట్ల వేలాడుతున్న వైర్ల ను సరిచేశామని, 2,310 మధ్య స్తంభాలను ఏర్పాటు చేయడంతోపాటు ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ సౌకర్యం కల్పించామని తెలిపా రు. మోటార్లు ఎక్కువకాలం మన్నికగా ఉండాలంటే తప్పనిసరిగా కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి సమస్యలున్నా వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
మరోసారి దొంగల అలజడి
● బంగారు దుకాణంలో చోరీకి యత్నం
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో మరోసారి దొంగల అలజడి రేగింది. వరుసగా వారం రోజులపాటు వివిధ ప్రాంతాల్లో దొంగతనానికి యత్నిస్తున్నారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున సుభాష్‌నగర్‌లోని బంగారు దుకాణంలో చోరీకి ప్రయత్నించారు. గునపాలతో షెట్టర్‌ను తొలగించి దొంగతనం చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పెట్రోలింగ్ వాహనం రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు దొంగల కోసం గాలించినా వారి ఆచూకీ లభించలేదు. ఇటీవల ఖలీల్‌వాడిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంను కొల్లగొట్టేందుకు దొంగలు ప్రయత్నించగా పెట్రోలింగ్ పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయి, చివరికి పోలీసులకు చిక్కారు. సుభాష్‌నగర్‌లో దుండగులు చోరీకి యత్నించిన బంగారు దుకాణాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.


