నైపుణ్యాలను మెరుగుపరచాలి
రామారెడ్డి: విద్యార్థులలో నైపుణ్యాలు మెరుగుపడేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం ఆయన గిద్ద గ్రామంలోని హైస్కూల్‌ను సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ప్రతిభ చూపినవారిని అభినందించారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ చూపాలని సూచించారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించాలన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
ఇళ్ల నిర్మాణాల పరిశీలన
గిద్ద గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. లబ్ధిదారుడితో మాట్లాడి పనుల వివరాలను తెలుసుకున్నారు. నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని సూచించారు. తిరుగు ప్రయాణంలో రామారెడ్డిలో అగిన కలెక్టర్‌కు రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్ గ్రామ సమస్యలను వివరించారు. కలెక్టర్ వెంట ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీఈవో రాజు, ఆర్డీవో వీణ, తహసీల్దార్ ఉమాలత తదితరులున్నారు.


