పనులు త్వరగా పూర్తి చేయాలి
● నాణ్యత ప్రమాణాలు పాటించాలి
● అధికారులతో సమీక్షలో
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతిరోజూ నివేదిక సమర్పించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే నివేదికలలో స్పష్టంగా పొందుపర్చాలని సూచించారు. సమావేశంలో డీఈవో రాజు, డీఆర్‌డీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరి బాధ్యత..
కామారెడ్డి క్రైం: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు. విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీటీవో శ్రీనివాస్, సీఐలు, ఏఎంవీఐలు పాల్గొన్నారు.


