మున్సిపల్ ఓటర్ల ముసాయిదా విడుదల
● 5వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
● 10న తుది ఓటరు జాబితా ప్రకటన
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు గురువారం విడుదల చేశారు. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వార్డుల వారీగా ఓటర్ల వివరాలను వెల్లడించారు. తాజా జాబితా ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 99,555 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 48,511 మంది, మహిళా ఓటర్లు 51,027 మంది, ఇతరులు 17 మంది ఉన్నారు. ఆర్డీవో, తహసీల్, మున్సిపల్ కార్యాలయాల నోటీస్ బోర్డులపై ముసాయిదాను అతికించారు. ఈ ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 5వ తేదీలోపు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఈనెల 10న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈ హన్మంత్‌నాయక్, టీపీవో గిరిధర్, ఆర్‌ఐ లలిత, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో మున్సిపల్ ఓటర్ల ముసాయిదా జాబితాను కమిషనర్ మహేష్‌కుమార్ విడుదల చేశారు. కార్యక్రమంలో మేనేజర్ వాసంతి, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.
మున్సిపల్ ఓటర్ల ముసాయిదా విడుదల


