బాన్సువాడలో..
బాన్సువాడ : బాన్సువాడ మున్సిపల్ ఓటర్ల ముసాయిదా జాబితాను కమిషనర్ శ్రీహరి రాజు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల ముసాయిదా ఓటర్ల జాబితాలను సబ్ కలెక్టర్ కార్యాలయం, తహసీల్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాల్లోని నోటీస్ బోర్డులపై ప్రదర్శించామన్నారు. ఓటర్లు తమ పేరు, వార్డు వివరాలు సరిచూసుకోవాలని, ఏమైనా అభ్యంతరాలు, మార్పులు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు దత్తురెడ్డి, నారాయణ, సతీశ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


