ఘనంగా కోరేగావ్ దినోత్సవం
బాన్సువాడ రూరల్: మండలంలోని కాద్లాపూర్ గ్రామంలో గురువారం అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో భీమాకోరేగావ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. మహారాష్ట్రలో పీష్వాలు వర్ణవ్యవస్థను అమలు పర్చడంతో మహార్‌లు ఆత్మగౌరవం కోసం చేసిన యుద్దంలో విజయం సాధించినందుకు గుర్తుగా కోరేగావ్ దినోత్సవం జరుపుకుంటున్నామని నాయకులు తెలిపారు. అలాగే బీబీపేట మండలంలోని శేరి బీబీపేట గ్రామంలో భీమాకోరేగావ్ దినోత్సవం నిర్వహించారు. అంబేడ్కర్ సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఘనంగా కోరేగావ్ దినోత్సవం


