తెయూను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలి
తెయూ(డిచ్‌పల్లి) : నూతన సంవత్సరంలో ఉద్యోగులు మరింత ఐక్యంగా పనిచేసి వర్సిటీ ప్రతిష్ట పెంపొందించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ టి యాదగిరిరావు ఆకాంక్షించారు. గురువారం తన చాంబర్‌లో రిజిస్ట్రార్ ఎం యాదగిరితో కలిసి ఆయన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పబ్లికేషన్ సెల్ డైరెక్టర్ ఎం సత్యనారాయణరెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ జీ చంద్రశేఖర్, పరీక్షల నియంత్రణ అధికారి కే సంపత్ కుమార్, యూజీసీ కో ఆర్డినేటర్ ఆంజనేయులు, డీన్‌లు లావణ్య, ఆపర్ణ, రాంబాబు, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి, ఆయా విభాగాల ఆచార్యులు, అధ్యాపకులు, బోధనేతర సి బ్బంది తదితరులు పాల్గొన్నారు.


