కొనసాగుతున్న రైల్వే డబ్లింగ్ పనులు
● ట్రాఫిక్‌కు అంతరాయం
నవీపేట: డబుల్ రైల్వే లైన్ విస్తరణ పనులు కొనసాగడంతో మండల కేంద్రంలోని ప్రధాన రైల్వేగేటు సమీపంలో మంగళవారం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మేడ్చల్ –ముద్‌ఖేడ్ డబుల్ రైల్వే లైన్ పనులలో భాగంగా నవీపేట నుంచి బాసర వరకు మొదటి దశ పనులు పూర్తి కానున్నాయి. జనవరిలో 13 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌పై రైలు పరుగెత్తనుంది. ఇరువైపులా లైన్ విస్తరణ పనులు పూర్తయ్యాయి. నవీపేట మండల కేంద్రంలో ట్రాక్ వద్ద పనులను మంగళవారం నిర్వహించారు. ట్రాక్ లెవల్, బీటీ భర్తీ పనులను నిర్వహించడంతో గేటును కొద్దిసేపు మూసేశారు. వాహనాల రద్దీతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు వా హనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.


