రుణాలను సకాలంలో మంజూరు చేయాలి
కామారెడ్డి క్రైం: రైతులకు పంట రుణాలను సకాలంలో మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్దేశించిన రుణ పంపిణీ లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ, పీఎంఈజీపీ, ఇతర అన్ని రకాల రుణాలకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. సమావేశంలో నాబార్డ్ డీడీఎం ప్రవీణ్ కుమార్, ఎల్‌డీఎం చంద్రశేఖర్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, బ్యాంకర్లు పాల్గొన్నారు.


