రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఎంపిక
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మోడల్‌స్కూల్‌కు చెందిన విద్యార్థిని శ్రీజ రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఎంపికై నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపల్ జహంగీర్ మంగళవారం తెలిపారు. జిల్లా స్థాయి ప్రతిభా పరీక్షలో శ్రీజ మూడో బహుమతి పొంది ఎంపికై నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న శ్రీజను ఉపాధ్యాయులు అభినందించారు.
బాన్సువాడ రూరల్: బోర్లం గ్రామం పాత ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జనవరి 4న సద్గురు సమర్థ మహారాజ్ దివ్యదర్శనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిర్వాహకులు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు, వాల్‌పోస్టర్లను రాష్ట్ర వ్యవసాయశాఖ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో ఆవిష్కరించారు. భక్తులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పర్వారెడ్డి, రాజేశ్వర్‌గౌడ్, సర్పంచ్ మన్నె రమేష్, నర్సింహులు, సాయిలు, భరత్ తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఫరీదుపేటలో ఈ నెల 6న అగ్నిప్రమాదంలో ఎర్రొళ్ల రాజయ్య, శ్యామల ఇళ్లు దగ్ధమైంది. మంగళవారం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించిన సర్పంచ్ నర్సింహారెడ్డి.. ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామస్తులు పాల్గొన్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ ముమ్మరంగా కొనసాగుతుంది. సోమవారం నాటికి 1 లక్షా 53 వేల టన్నుల క్రషింగ్ జరిగినట్లు ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రావ్ తెలిపారు. ఈ సీజన్‌లో 3 లక్షల టన్నుల క్రషింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. పర్మిట్ల ఆధారంగా చెరుకును గానుగకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ బట్టుపల్లి రేణుక దక్షిణభారత దేశం ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దయానంద సరస్వతి తెలిపారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్టు ఆయన వివరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉపాధ్యాయులు, గ్రామస్తులు రేణుకను అభినందించారు.
పిట్లం(జుక్కల్): తిమ్మనగర్ జీపీ కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ చీరలను మహిళలకు సర్పంచ్ ప్రవీణ్ పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. మహిళ సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
బాన్సువాడ: బీర్కూర్‌లో మంగళవారం డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరలను సర్పంచ్ ధర్మతేజ, ఉప సర్పంచ్ పరమేశ్వర్ కులకర్ణిలు పంపిణీ చేశారు. వార్డు సభ్యులు మెహరినీత, నాగమణి, జీవిత, హేమలత, భాగ్య పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఎంపిక
రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఎంపిక
రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఎంపిక


