సవాల్ స్వీకరించిన నేతలు.. అరెస్ట్ చేసిన పోలీసులు
బాన్సువాడ: ఆరోపణలు చేసిన వారి సవాల్‌ను స్వీకరించి అయ్యప్ప ఆలయానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుర్కి గ్రామంలో వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డిలు.. మాజీ జెడ్పీటీసీ కిషోర్ యాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, మాజీ సర్పంచ్ నారాగౌడ్‌లపై చేసిన తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. అవి అబద్ధాలని నిరూపించడానికి అయ్యప్ప ఆలయానికి వస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం శోచనీయమని ఆన్నారు. శాంతియుతంగా ఆలయంలో కుర్చుంటే అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు మాసాని శ్రీనివాస్‌రెడ్డి, పాత బాలకృష్ణ, నందురెడ్డి, ప్రతాప్‌సింగ్, అక్బర్, శ్రీనివాస్, లయక్, వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.


