గణిత ప్రతిభా పరీక్షలో ప్రథమ స్థానం
బాన్సువాడ రూరల్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన గణిత ప్రతిభా పరీక్షలో బోర్లం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన బి.రామ్‌చరణ్ ప్రథమ స్థానం సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ తెలిపారు. గణిత ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రతిభా పోటీలో పాఠశాల విద్యార్థి ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. ఈమేరకు విద్యార్థి రామ్‌చరణ్‌తో పాటు గణితం గైడ్ టీచర్ పద్మ శ్రీనివాస్‌ను హెచ్‌ఎం అభినందించారు.
మాచారెడ్డి: జిల్లా స్థాయి గణిత పరీక్షలో చుక్కాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన వైష్ణవి, ప్రదీప్‌రెడ్డిలు ప్రథమ, తృతీయ స్థానం సాధించగా, మాచారెడ్డి ఉన్నత పాఠశాలకు చెందిన విష్ణుప్రియ ద్వితీయ స్థానం సాధించింది. ఈ సందర్భంగా గణిత పరీక్షలు ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎంఈవో దేవేందర్‌రావ్, మాచారెడ్డి హెచ్‌ఎం వెంకటాచారి, ఉపాధ్యాయులు అభినందించారు.


