కువైట్‌లో రాంపూర్ వాసి..
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బంటు రవి అలియాస్ ప్రకాష్(50) కువైట్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ఈ నెల 27న రవి తన గదిలో భోజనం చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. దీంతో స్థానికులు ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. కాగా రవి గత 12 సంవత్సరాలుగా ఉపాధి కోసం కువైట్‌లో ఉంటున్నట్లు తెలిపారు. మృతదేహం మంగళవారం రాత్రి ఇండియాకు వస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మీ, కుమారుడు త్రిజాల్ ఉన్నారు.


