మహిళల సౌకర్యార్థం మరుగుదొడ్డి నిర్మాణం
పిట్లం(జుక్కల్): నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని సహాయక మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు రఫీ, ఇర్షాద్ పేర్కొన్నారు. వారు మంగళవారం మండల కేంద్రంలో ఆటో రిక్షాలు, ఇతర వాహనాల ద్వారా ప్రయాణించే విద్యార్థుల భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని, జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు ఆటో రిక్షాలు, మినీ క్యాబ్‌లపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేశారు.
బీబీపేట: మల్కాపూర్ మహిళా సమాఖ్య భవనంలో మహిళల సౌకర్యార్థం మరుగుదొడ్డి నిర్మాణానికి గ్రామానికి చెందిన దాత సిరిగాద స్వామి ముందుకు వచ్చారు. మంగళవారం మరుగుదొడ్డి నిర్మాణానికి సర్పంచ్ రామగల్ల నాగరాజు పనులను ప్రారంభించారు. సుమారు రూ. 40 వేల వరకు నిర్మాణానికి ఖర్చవుతుందని ఆయన తెలిపారు. మహిళా సమాఖ్య భవనానికి ఇప్పటివరకు మరుగుదొడ్లు లేకపోవడంతో అక్కడకు వచ్చే మహిళలు చాలా ఇబ్బందులు పడేవారని, దీంతో స్వామి స్పందించి నిర్మాణానికి ముందుకు రావడం మంచి విషయమని ఆయనకు మహిళా సమాఖ్య సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
మహిళల సౌకర్యార్థం మరుగుదొడ్డి నిర్మాణం
మహిళల సౌకర్యార్థం మరుగుదొడ్డి నిర్మాణం


