నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసమే ఉచిత శిక్షణ
హజ్ యాత్రికులకు అండగా ఉంటాం
నిజామాబాద్ రూరల్: నిరుద్యోగులకు స్వయం ఉ పాధి కల్పించడం కోసమే బైతుల్ మాల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని ఆటోనగర్‌లో మంగళవారం ఇన్‌స్ట్యూట్ బైతుల్ మాల్ ఆ ధ్వర్యంలో ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆయన హాజరై, శిక్షణ కోర్సులను ప్రారంభించారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. శిక్షణ కేంద్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తనవంతుగా రూ.2లక్షలు అందజేసినట్లు తెలిపారు. నిరుద్యోగ మహిళలు, విద్యార్థులకు ఉపాధికి అనుకూలమైన పలు కోర్సుల్లో (కంప్యూటర్ శిక్షణ, టైలరింగ్, మె హందీ డిజైన్, అడ్వాన్సడ్ బ్యూటీషియన్) శిక్షణ ఇ వ్వనున్నట్లు తెలిపారు. సంస్థ ప్రతినిధులు, స్థానిక నాయకులు, శిక్షణార్థులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: హజ్ యాత్రికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని బోధన్ రోడ్‌లోగల నిజాం ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఈ ఏడాది హజ్‌కు వెళ్లనున్న యాత్రికుల కోసం జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. హజ్ యాత్రలో పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రయాణ ఏర్పాట్లు, వసతి, రవాణా తదితర లాజిస్టిక్ అంశాలపై అవగాహన కల్పించారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖుస్రో పాషా, హజ్ కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


