పౌర హక్కులకు భంగం కల్గించొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌ఐ కిరణ్
లింగంపేట(ఎల్లారెడ్డి): పౌర హక్కులకు భంగం కలిగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆర్‌ఐ కిరణ్ వెల్లడించారు. మంగళవారం ఆయన మెంగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. సమాజంలో ప్రతీ పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు.
కులమత బేధాలు లేకుండా సమాజంలో అందరూ సమానమే అని భావించాలన్నారు. తక్కువ కులం అని ఎవ్వరిని వివక్షకు గురి చేసినా నేరమన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో విజయాలు సాధించి, మానవ సమాజంలో ఎంతో వికాసం పొంది, రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 సంవత్సరాలు అయినా సాటి మనిషిని మనిషిగా గౌరవించకుండా అమానుషంగా హింసించడం, బాధించడం, దురదృష్టకరమైన విషయం అన్నారు. సర్పంచ్ కొమ్ముల మౌనిక, కార్యదర్శి బాలమణి, జీపీవో దీపిక, రమేశ్ పాల్గొన్నారు.


