మాజీ సర్పంచ్‌ల ముందస్తు అరెస్టు
లింగంపేట/మాచారెడ్డి/బీబీపేట:గ్రామ పంచాయ తీ పెండింగు బిల్లుల చెల్లింపుల విషయంలో సోమ వారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న సర్పంచ్‌లను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లింగంపేట, బీబీపేట, మాచారెడ్డి పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌లు మాట్లాడుతూ.. తమకు రావలసిన పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు.
కామారెడ్డి టౌన్: హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ‘తెలంగాణ విద్యా విధానం–2025’ ఉన్నత స్థాయి సమావేశంలో జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. సోమవారం డాక్టర్ కేశవ్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 24 మంది నిపుణులు విద్యా సంస్కరణలపై చర్చించారు. జిల్లా నుంచి ఎల్‌ఎఫ్‌ఎల్ కేటగిరీలో ప్రధానోపాధ్యాయులు నర్సింగ్ రావు, ఎస్జీటీ(ఉర్దూ) కేటగిరీలో ఎండీ ఖుర్షీద్ అహ్మద్ పాల్గొని విద్యా వ్యవస్థ బలోపేతానికి పలు సిఫార్సులు చేశారు. విద్యా కమిషనర్ దేవ్‌సేన, ఎన్‌సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్‌ల ముందస్తు అరెస్టు


