పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి
మాచారెడ్డి: సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని మాచారెడ్డి ఎంఈవో సురభి దేవేందర్‌రావ్ పిలుపునిచ్చారు. సోమవారం మాచారెడ్డి విద్యావనరుల కేంద్రంలో బడి బాగు– సర్పంచ్‌ల పాత్ర అంశంపై ఆయన మాట్లాడారు. పాఠశాలల అభివృద్ధి ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అలాగే గ్రామ భవిష్యత్తు ప్రథమ పౌరులైన సర్పంచ్‌లపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాచారెడ్డి మండలంలోని 25 గ్రామాల సర్పంచ్‌లను ఆత్మీయంగా సత్కరించారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్‌రెడ్డి, భాస్కర్, వెంకటచారి, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.


