విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి
మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మృతుడి తల్లిదండ్రులు ప్రజావాణికి వచ్చారు. అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్, ప్రతినిధులు మాట్లాడుతూ.. అచ్చంపేట సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ ఇంటర్ చదువుకుంటున్న గొట్టం అజయ్ అనే విద్యార్ధి ఈ నెల 27న మంజీరా కెనాల్‌లో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఆయన కుటుంబం వీధిన పడిందన్నారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.


