బైకును ఢీకొట్టిన లారీ
● ఇద్దరికి గాయాలు
ఎల్లారెడ్డి: పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై బైక్, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు సోమవారం తెలిపారు. నాగిరెడ్డిపేట మండలంలోని ఎర్రారం గ్రామానికి చెందిన గూల గోపాల్, గూల మల్లేష్ అలియాస్ సాతెల్లి మల్లేశ్ బైక్‌పై ఎల్లారెడ్డి నుంచి సొంతూరికి వెళ్తుండగా హైదరాబాద్ నుంచి నిజాంసాగర్ వైపు వెళ్తున్న లారీ ఎదురుగా ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గోపాల్ తలకు తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని హైదరాబాద్‌కు రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు.


