నేడు జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్ష | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్ష

Dec 30 2025 7:49 AM | Updated on Dec 30 2025 7:49 AM

నేడు

నేడు జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్ష

నేడు జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్ష జీపీవోను తొలగించాలని ఫిర్యాదు ఆరోగ్యమే మహా భాగ్యం ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయాలి

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ గంజ్‌ ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్షను నిర్వహించనున్నట్లు ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తాడ్వాయి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో మాట్లాడారు. మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకావాలన్నారు. ఇలాంటి ప్రతిభా పరీక్షలు గణితంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు విద్యార్థుల ఆలోచనా శక్తిని అభివృద్ధి చేస్తాయని తెలిపారు. ఫోరం జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్‌, కార్యదర్శి రామారావు, ఖజానాదారు నరేందర్‌, ప్రతినిధులు పాల్గొన్నారు.

బాన్సువాడ : బీర్కూర్‌ మండలం బరంగెడ్గి జీపీవో మల్లేశ్‌ను తొలగించాలని బరంగెడ్గి సర్పంచ్‌ అనీల్‌ కుమార్‌ సోమవారం తహసీల్దార్‌ భుజంగరావుకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 28న గ్రామ శివారులో మట్టి తవ్వకాలు జరుపుతున్న విషయం కొందరు రైతులు తమ దృష్టికి తీసుకురాగ వెంటనే జీపీవో మల్లేశ్‌కు తాను ఫోన్‌ చేసి మట్టి తవ్వకాలు నిలిపివేయాలని సూచించడంతో తనను జీపీవో ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించాడని, వెంటనే మల్లేశ్‌ను తొలగించి ఇతరులను నియమించాలని సూచించారు. కాల్‌ రికార్డు కాపీని సమర్పిస్తున్నానని తెలిపారు. విచారణ చేస్తామని తహసీల్దార్‌ భుజంగరావు అన్నారు. రైతులు బాలయ్య, గంగొండ ఉన్నారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మోతె సర్పంచ్‌ వజీర్‌ సుజాతబాయి సూచించారు. సోమవా రం మోతెలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. వైద్యులు సూచించిన పద్ధతి లో ఆహారం తీసుకోవాలన్నారు. ప్రతీ రోజు యోగా, వ్యాయామం చేయాలన్నారు. 250 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. వైద్యులు నాగేశ్వర్‌రావు, ఆనంద్‌, రోహిత్‌, శ్రీదేవి, కీర్తి, గ్రామ ఉపసర్పంచ్‌ రవి పాల్గొన్నారు.

సంగోజీవాడిలో ఉచిత వైద్య శిబిరం

తాడ్వాయి(ఎల్లారెడ్డి):సంగోజీవాడిలో సోమవా రం మల్లారెడ్డి, నారాయణ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి 155 మందికి వైద్య పరీక్షలు చేశారు. మాత్రలను పంపిణీ చేశారు. సర్పంచ్‌ తాజోద్దీన్‌, వైద్య సిబ్బంది, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డిరూరల్‌(ఎల్లారెడ్డి): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ వారి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను తమ కార్యాలయంలో అందజేయాలని నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎల్లారెడ్డి ఎంపీవో ప్రకాశ్‌లు వేర్వేరుగా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖర్చుల వివరాలను ఎన్నికలు జరిగిన 45 రోజులలో అందజేయాలని వెల్లడించారు. ఎన్నికల ఖర్చుల వివరాలను అందజేయని అభ్యర్థులు తర్వాత జరిగే ఎన్నికలలో పోటీకి అనర్హులని చెప్పారు.

నేడు జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్ష 1
1/2

నేడు జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్ష

నేడు జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్ష 2
2/2

నేడు జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement