పట్టణ సుందరీకరణే లక్ష్యం
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి టౌన్: పట్టణంలో మౌలిక వసతుల కల్పన, సుందరీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో సుమారు రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు విస్మరించిన ప్రాంతాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, నాయకులు పండ్ల రాజు, అశోక్‌రెడ్డి, కన్నయ్య, చందు తదితరులు పాల్గొన్నారు.
మత సామరస్యానికి ప్రతీక క్రిస్మస్
మత సామరస్యానికి ప్రతీక క్రిస్మస్ అని షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, ప్రేమ, మానవత్వాన్ని పెంపొందించిన యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శనీయమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం
భిక్కనూరు: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం అమలవుతుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. సోమవారం భిక్కనూరు గ్రామ పంచాయతీ 9వ వార్డు సభ్యుడు గజ్జె వేణు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యువత రాజకీయాల్లోకి రా వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, ఉప సర్పంచ్ దుంపల మోహన్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అందె దయాకర్‌రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.
పేదలకు కొండంత అండ సీఎంఆర్‌ఎఫ్
కామారెడ్డి టౌన్: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి ఆర్థికంగా కుంగిపోయిన నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్) కొండంత అండగా నిలుస్తుందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు సుమారు రూ.50 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, నాయకులు పాల్గొన్నారు.


