ఇందిరా మహాశక్తి చీరల పంపిణీ
బిచ్కుంద(జుక్కల్): ఖద్‌గాంలో ఇందిరా మహాశక్తి చీరలను సోమవారం సర్పంచ్ రాధికాబాయి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఏఎంసీ వైస్ చైర్మన్ శంకర్ పటేల్, ఉపసర్పంచ్ సయ్యద్ మన్ను, మాజీ సర్పంచ్ జీవన్, రాజు పటేల్ పాల్గొన్నారు.
పిట్లం(జుక్కల్): కంభాపూర్ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ చీరలను సర్పంచ్ సుజాత పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఐకేపీ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని మొగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ బస్వంత్‌పటేల్ చేతుల మీదుగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్, ఉప సర్పంచ్ బాలు పటేల్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇందిరా మహాశక్తి చీరల పంపిణీ
ఇందిరా మహాశక్తి చీరల పంపిణీ


