పేరు మార్పుపై నిరసన
కామారెడ్డి టౌన్: ఉపాధి హామీ పథకం పేరు మార్చడం తగదని డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బాపూజీ పేరును తొలగించడం ఆయన ఆశయాలను అవమానించడమేనన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, నాయకులు పండ్ల రాజు, శ్రీను, గంగాధర్, లక్ష్మణ్, మోహన్ పాల్గొన్నారు.


