జావెలిన్ త్రోలో ద్వితీయ స్థానం సాధించిన కానిస్టేబుల్
సదాశివనగర్ : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న జె.లక్ష్మణ్ అథ్లెటిక్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈనెల 27, 28 తేదీలలో 12వ మాస్టర్స్ అథ్లెటిక్స్ రాష్ట్ర చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. జావెలిన్ త్రో 50 ఏళ్లు పైబడిన విభాగంలో 28.3 మీటర్ల ప్రదర్శనలో లక్ష్మణ్ ద్వితీయ స్థానం సాధించడం పోలీస్ శాఖకు గర్వకారణంగా ఉందని ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. లక్ష్మణ్‌ను సహచర సిబ్బంది అభినందించారు.
సూపర్ బ్రెయిన్ యోగాతో ఏకాగ్రత
● గుంజిళ్ల మాస్టర్ అందె జీవన్ రావు
డిచ్‌పల్లి: సూపర్ బ్రెయిన్ యోగా ఆచరణతో విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతుందని గుంజిళ్ల మాస్టర్ అందె జీవన్‌రావు తెలిపా రు. ఈనెల 26, 27వ తేదీలలో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భక్తి వేదాంత ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ‘వాస్తవికత నిర్మాణంలో సూపర్ బ్రెయిన్ యోగా పాత్ర’ అనే అంశంపై తన పరిశోధనా పత్రాన్ని సమర్పించి ప్రసంగించారు. సూపర్ బ్రెయిన్ యోగాతో మెదడు లోని కుడి, ఎడమ భాగాలు సమన్వయంతో పనిచేస్తాయని, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. ఆల్ఫా తరంగాల క్రియాశీలత పెరగడంతో అనవసర విషయాలు, సమాచారం మెదడును చేరవని దీంతో వాస్తవికత ప్రామాణికత పెరుగుతుందని తెలిపారు.
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక
కమ్మర్‌పల్లి: హాసాకొత్తూర్ జెడ్పీహెచ్‌ఎస్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న రిషిత రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం అరుణశ్రీ తెలిపారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన రిషిత రాష్ట్రస్థాయికి ఎంపికై ందన్నారు.
గోదావరిలో
పసికందు మృతదేహం
నవీపేట: యంచ శివారులోని గోదా వరి నది నీటిలో ఆదివారం మగశిశువు మృతదేహం తేలియాడుతూ కనిపించింది. గుర్తు తె లియని వ్యక్తులు శిశువు మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి గోదావరి నదిలో పడేశారని ఎస్సైలు శ్రీకాంత్, యాదగిరి గౌడ్ తెలిపారు. రెండు రోజుల క్రితం జన్మించిన మగశిశువును నీటిలో పడేసి ఉంటారన్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
జావెలిన్ త్రోలో ద్వితీయ స్థానం సాధించిన కానిస్టేబుల్
జావెలిన్ త్రోలో ద్వితీయ స్థానం సాధించిన కానిస్టేబుల్


