రోడ్డు ప్రమాదాలు.. | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలు..

Dec 29 2025 7:40 AM | Updated on Dec 29 2025 7:40 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదాలు..

రోడ్డు ప్రమాదాలు.. పెరిగిన దోపిడీలు.. కేసులు కేసులే.. పేకాట పేకాటే... జోరుగా గంజాయి, అల్ప్రాజోలం దందా

పది రోజులకో హత్య...

జిల్లాలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు వల విసురుతూ అడ్డంగా దోచుకుంటున్న సంఘటనలు రోజూ

రెండు మూడు వెలుగుచూస్తున్నాయి. ఈ ఏడాది కిడ్నాప్‌లు,

అత్యాచారాలు పెరిగాయి. రోడ్డు ప్రమాద

మరణాలు కొంత మేర తగ్గాయి. హత్యలు, హత్యా

యత్నాలు దాదాపు వారానికొకటి కామన్‌గా

మారాయి. 2025లో జరిగిన నేరాలపై రౌండప్‌..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రూపంలో వల విసురుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నిలువునా ముంచుతున్నారు. అన్నీ తెలిసిన వారూ వాళ్ల వలలో చిక్కి మోసపోతున్నారు. జిల్లాలో ఈ ఏడాది సైబర్‌ నేరాలకు సంబంధించి 980 పిటిషన్లు వచ్చాయి. 160 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సైబర్‌ నేరస్తులు రూ. 5.82 కోట్లు కొల్లగొట్టగా.. పోలీసులు అందులో రూ. 1.07 కోట్లు రికవరీ చేశారు. సైబర్‌ నేరాలపై పోలీస్‌ యంత్రాంగం ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ మోసపోతూనే ఉన్నారు. రకరకాల మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

జిల్లాలో చిన్నపాటి దొంగతనాలు కాస్త తగ్గినా.. దోపిడీ కేసులు మాత్రం పెరిగాయి. 2024లో 506 చిల్లర దొంగతనాలు జరగ్గా ఈసారి 434 కి తగ్గాయి. తాళం వేసిన ఇళ్లలో చోరీలకు సంబంధించి గతేడాది 214 కేసులు నమోదవగా ఈసారి 224 నమోదయ్యాయి. గతేడాది 15 దోపిడీ కేసులు నమోదవగా ఈసారి 35 కి పెరిగాయి.

జిల్లాలో పేకాట ఆగడం లేదు. పోలీసులు దాడులు చేసి, కేసులు పెడుతున్నా సరే పేకాడేవారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గతేడాది 214 సంఘటనల్లో 1,113 మందిపై గ్యాంబ్లింగ్‌ కేసులు నమోదు చేసి వారినుంచి రూ.38.10 లక్షలు స్వీధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఈ సంవత్సరం 305 సంఘటనల్లో 1,733 మందిపై గ్యాంబ్లింగ్‌ కేసులు పెట్టి రూ.32.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో గంజాయి అమ్మకాలు జోరుగా నడుస్తున్నాయి. అప్పుడప్పులు పోలీసులు దాడులు చేస్తున్నా దందాకు అడ్డుకట్ట పడడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే కృత్రిమ కల్లు తయారీకి వాడే అల్ప్రాజోలం దందా విచ్చలవిడిగా నడుస్తోంది. చాలా ప్రాంతాల్లో కల్లు తయారీకి దీనిని వాడుతున్నారు.

జిల్లాలో పది రోజులకో హత్య జరుగుతోంది. ఈ ఏడాది 36 మంది హత్యకు గురయ్యారు. మరో 30 మందిపై హత్యాయత్నం జరిగింది. గతేడాది 37 మంది హతమవగా 20 మందిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఏడాది కిడ్నాప్‌ కేసులు పెరిగాయి. గతేడాది 39 కిడ్నాపులు నమోదయితే ఈసారి 43 కు చేరాయి. రేప్‌ కేసులు కూడా పెరిగాయి. గతేడాది 61 కేసులు నమోదవగా, ఈసారి 67 నమోదయ్యాయి. పోక్సో కేసులు గతేడాది 89 నమోదవగా, ఈసారి 101 కి చేరాయి. వరకట్నపు వేధింపుల కేసులు గతేడాది 312 నమోదైతే, ఈసారి 247 కి తగ్గాయి.

సామాన్యుడిని ముంచిన

సైబర్‌ నేరగాళ్లు

రోజుకో కొత్త తరహాలో మోసాలు

పెరిగిన కిడ్నాప్‌లు, అత్యాచారాలు

తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు

రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు కొంతమేర సత్ఫలితాలనిచ్చాయి. 2024 సంవత్సరంలో 569 రోడ్డు ప్రమాదాలు జరిగి 275 మంది చనిపోగా.. ఈ సంవత్సరంలో 486 రోడ్డు ప్రమాదాల్లో 211 మంది మృత్యువాతపడ్డారు. ట్రాఫిక్‌ రూల్స్‌ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తూ కేసులు పెడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 11,413 కేసులు పెట్టారు. తాగి వాహనాలు నడుపుతూ దొరికిన వారికి భారీ జరిమానాలతో పాటు ఒకటి, రెండు రోజుల జైలు శిక్షలు కూడా పడుతున్నాయి. హెల్మెట్‌ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిపై 3,16,839 కేసులు, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేసిన వారిపై 1,368 కేసులు, ఓవర్‌ స్పీడ్‌కు సంబంధించి 98,717 కేసులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపిన వారిపై 1,32,315 కేసులు, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ చేసినవారిపై 2,493 కేసులు నమోదయ్యాయి.

రోడ్డు ప్రమాదాలు..1
1/1

రోడ్డు ప్రమాదాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement