‘ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి’
నిజాంసాగర్: ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి సూచించారు. ఆదివారం నిజాంసాగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నవోదయ విద్యాలయాలు దేశానికి ఆదర్శమన్నారు. నవోదయ విద్యాలయాల్లో చదివినవారు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని ప్రస్తుత విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో నవోదయ ప్రిన్సిపాల్ సీతారాం బాబు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.


